శ్రీమద్రామాయణం Srimadramayanam

శ్రీమద్రామాయణం Srimadramayanam

జై శ్రీరామ్

*Om Apadamapa Hataram Dataram sarva sampadam loka Bhi rāmam śrī rāmam bhūyo bhūyo Namam-yaham*🙏


*Meaning*
*I bow to that Lord Rama who is ever beautiful* *who destroys all dangers and gives all sorts of wealth*.

*ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్* |
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్* ||

శ్రీమద్రామాయణం Srimadramayanam

• • •

  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 45 & 46 పరిసమాప్తం
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 45* రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు ధరించి, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతో ధనువు పైకి వచ్చి “రామా! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తోంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు. నలుగురు వానరములతో కలిసి ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయనని, ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరస పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి. సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు.” “ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమ దిక్కుకి వెళ్ళు. అక్కడ అనేకమైన … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 45 & 46 పరిసమాప్తం
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 43 & 44
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 43* అప్పుడు రాముడు “చూశావా లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను. అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కింద పడతాయి. నువ్వు వెళ్ళి ఆ … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 43 & 44
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 41 & 42
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 41* శాంతించిన రాముడితో లక్ష్మణుడు “అన్నయ్యా! చూశావా లోకం పోకడ ఎలా ఉంటుందో! కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా? (ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు. అదేమిటంటే “యయాతీ! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు?” అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా “నేను ఎన్నడూ అసత్యం పలకలేదు” అన్నాడు. “నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు” అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు. జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 41 & 42
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 39 & 40
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 39* రాముడి బాధని చూసి లక్ష్మణుడు “అన్నయ్యా! బెంగ పెట్టుకోకు. వదిన గోదావరి తీరానికి నీళ్ళు తేవడానికి వెళ్ళి ఉంటుంది. అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను” అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు. తిరిగొచ్చిన లక్ష్మణుడు “సీతమ్మ ఎక్కడా కనపడలేదు” అన్నాడు. అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది దగ్గరికి వెళ్ళి “గోదావరీ! నిజం చెప్పు. ఎక్కడుంది సీత? నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు” అన్నాడు. *[భూతాని రాక్షసేంద్రేణ వధ అర్హేణ హృతాం అపి |**న తాం శశంసూ రామాయ తథా గోదావరీ నదీ ||]* అక్కడున్న పంచభూతాలు జరిగినది చూశాయి కానీ చెపుదాము అంటే రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి. అప్పుడా పంచభూతాలు గోదావరితో “గోదావరీ! సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయిన సంగతి చెప్పెయ్యి. రాముడి బాధ చూడలేక … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 39 & 40
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 37 & 38
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 37* *[ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ* *ప్రసాదం కురు మే క్షిప్రం వశ్యో దాసో అహం అస్మి తే ||]* ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన ఆ రావణుడు “నీ పాదాలు పట్టుకుంటున్నాను సీతా! నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు” అన్నాడు. (రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా, శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు కనుక, సీతమ్మని ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు). అప్పుడు సీతమ్మ, తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డిపరకని అడ్డుగా పెట్టి “రాముడు ధర్మాత్ముడు. దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు. విశాలమైన కన్నులున్నవాడు. ఆయన నా భర్త. నా దైవం. ఇక్ష్వాకు కులంలో పుట్టి, సింహం వంటి మూపు ఉండి, లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉండు రావణా! నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటే, ఈ … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 37 & 38
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 35 & 36
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 35* *[త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా |**మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా ||]* రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అన్నది “నువ్వు మాయా మృగాన్ని సృష్టించి, నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్టసంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి, ఒంటరిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. అలాగే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ఇలా జరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చెయ్యడం నీ పరాక్రమానికి కానీ, నీ తపస్సుకి కానీ, ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కానీ ఏవిధంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు. ఇలా చెప్పుకోడానికి నీకు సిగ్గువెయ్యడం లేదా? నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే, రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 35 & 36
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 33 & 34
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 33* ఆడ త్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ, రథంలో బలవంతంగా ఎక్కించి తన తొడల మీద కుర్చోపెట్టుకున్నాడు. అప్పుడాయన రథాన్ని బయలుదేరు అనేసరికి, ఆ రథం బయలుదేరింది. ఆకాశమార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ “రామా! రామా! మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది? ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మం కోసమని జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామా! నీ భార్యని ఇవ్వాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కదా! లక్ష్మణా! సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటివాడా! నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కదా! రక్షించండి, రక్షించండి” అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలాగే “ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరీ మీ … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 33 & 34
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ –31 & 32
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 31* అప్పుడు సీతమ్మ “నాకు అర్ధమయ్యిందిరా మహా పాపీ! కౄరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ధృవపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు. నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కానీ నువ్వు ఒక విషయం తెలుసుకో! ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా వద్ద నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను” అన్నది. అప్పుడు లక్ష్మణుడు “ఎంత ప్రమాదం తెచ్చావు వదినా ఈ రోజు? నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది” అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని “వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ –31 & 32
  • *శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 29 & 30
    *శ్రీమద్రామాయణం అరణ్యకాండ – 29 రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం వద్ద రథంలో దిగారు. బంగారు జింకగా మారిన మారీచుని కొమ్ములు ఇంద్రనీలము ప్రకాశించినట్టు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది. సన్నని కాళ్ళతో ఉంది. సృష్టిలో ఇప్పటి వరకూ ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది, గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్ళని తింటూ, అటూ ఇటూ పరుగులు తీస్తూ, సమీపంలో ఉన్న మృగాల దగ్గరికి వెళుతూ, మళ్ళీ తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మారీచుడు మిగతా మృగాల దగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి అభిముఖంగా … Continue reading *శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 29 & 30
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 27 & 28
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 27* “పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్నా, అధర్మాత్ముడితో స్నేహం పెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమీటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళకు. నాశనమయిపోతావు. ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళీ అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళీ కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి, వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి, అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో, … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 27 & 28
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 25 & 26
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 25* “నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని, యజ్ఞాలని నాశనం చెయ్యమని చెప్పాను. నేను చెప్పిన పనులని వారు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషణుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు 14,000 రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉందో తెలుసా? రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులను భయపెట్టేవాడు, దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు. అందుకని నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టంతో కూడుకున్న … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 25 & 26
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ –23 & 24
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 23* *[దీర్ఘబాహుః విశాలాక్షః చీర కృష్ణ అజిన అంబరః |**కందర్ప సమ రూపః చ రామో దశరథ ఆత్మజః ||]* అప్పుడా శూర్పణఖ “రాముడు పెద్ద పెద్ద చేతులతో, విశాలమైన కన్నులతో, మునుల వలె నార చీర, కృష్ణాజినం వేసుకొని, మన్మధుడిలా అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్టు ధనుస్సుని పట్టుకొని, నారాచ బాణములను సంధిస్తే, అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహా సర్పాలలాగ ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసులని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు. కానీ రాముడు బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురిచూసి వదిలాడో నేను చూడలేదు. కానీ రాక్షసుల తలకాయలు ఒక్కొక్కటిగా తృటిలో తెగిపోవడం నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణ ప్రయోగం చేస్తాడు. రాముడితో గుణములయందు, తేజస్సుయందు … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ –23 & 24
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 21 & 22
    *శ్రీమద్రామాయణం* అరణ్యకాండ – 21* (పైన జరిగిన కథ గురించి పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని నిజంగా వాల్మీకి మహర్షి రచించారా, లేక మరెవరైనా రచించి రామాయణంలోకి చొప్పించారా? అనేది వారి అనుమానం. ప్రధాన పాత్ర ప్రవేశించినప్పుడు వాల్మీకి మహర్షి ఆ పాత్ర గురించి తగినంత పరిచయము, వివరణ ఇస్తారు. కానీ ఇక్కడ రావణ పాత్ర గురించి ఎలాంటి పరిచయము లేకుండానే కథ సాగిపోయింది. అలాగే మారీచుడు చెప్పగానే అంత బేలగా రావణుడు తిరిగి వచ్చేస్తాడా? కేవలం ఒక రాక్షసుడు చెప్పిన కథనాన్ని విని రావణుడు సీతాపహరణం చెయ్యడానికి వెళతాడా? శూర్పణఖ ఆకాశమార్గంలో లంకకి వెళితే, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. దీని ప్రకారం శూర్పణఖ ముందు వెళ్ళాలి. కానీ అకంపనుడే ముందు వెళ్ళాడు. ఇవన్నీ వాల్మీకి రచనాశైలితో విభేదిస్తున్నట్టు కనబడడం చేత కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఈ సర్గలు బహుశా రామాయణంలోనివి కాకపోవచ్చు అన్నారు. కనుక వీటిని వివాదాస్పద సర్గలుగా … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 21 & 22
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 19 & 20
    *శ్రీమద్రామాయణం**అరణ్యకాండ – 19* అప్పుడు ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే, ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. అప్పుడా ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి రాముడి గుండె నుండి కొద్ది పాటి రక్తం స్రవించింది. *అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనుస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు “మూడులోకములను పరిపాలించగల సమర్ధుడైనా సరే, పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకం తలవంచి ఉండవచ్చు. కానీ వాళ్ళకి ఒకసారి అవకాశం వస్తే, పదిమందిలో ఒక్కత్తె వెళ్ళిపోతున్న పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు, అందరూ కలిసి అటువంటివాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలల్లో కూర్చుని … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 19 & 20
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 17 & 18
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 17* ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి “నేను ఇప్పుడే బయలుదేరతాను. నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను. నేను కానీ యుద్ధానికి వెళితే, నా ముందు నిలబడగలిగే వాడు అంటూ ఎవడూ ఉండడు” అని పలికి, 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఆ ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి. ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు-ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుంచి అగ్నిని కక్కుతూ, … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 17 & 18
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 15 & 16
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 15* అప్పుడు శూర్పణఖ “నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు. ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మాన్ని పాటించే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను. నాకు అపారమైన బలం ఉంది. స్వేచ్ఛావిహారం చేస్తుంటాను. ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు” అని సీతమ్మ వైపు చూసి “ఈవిడెవరు ఇంత అసహ్యంగా ఉంది? ఈవిడా నీ భార్య! ఈవిడ నీకు తగినది కాదు. నేను … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 15 & 16
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 13 & 14
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 13* *[ప్రీతో అస్మి తే మహత్ కర్మ త్వయా కృతం ఇదం ప్రభో |**ప్రదేయో యన్ నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||]* ఆ పర్ణశాలని చూసిన రాముడు “ఏమీ పని చేశావయ్యా లక్ష్మణా! నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను? నేను ఇవ్వగలిగిన కానుక ఏమిటో తెలుసా?” అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగలించుకుని “లక్ష్మణా! నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా! నువ్వు నాకు తండ్రివి. దశరథమహారాజు గారు వెళ్ళిపోలేదు. నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని” అన్నాడు. అలా వారు ఆ పంచవటిలో రోజూ చెయ్యవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు. కొంతకాలానికి హేమంత ఋతువు … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 13 & 14
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 11 & 12
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 11* “స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము” అని రాముడు అడుగగా, అగస్త్యుడు “నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను. కానీ నా తపః శక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను. నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దగ్గరలో పంచవటి అనే గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ. నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో” అన్నారు. సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి వద్ద సెలవు తీసుకొని, ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అన్నది. … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 11 & 12
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 9 & 10
    *శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 9* అప్పుడా సుతీక్ష్ణుడు “రామా! ఈ మాటే నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడినుంచి 4 యోజనముల దూరం దక్షిణంగా వెళితే అగస్త్య భ్రాత (అంటే అగస్త్యుని తమ్ముడు అని అర్ధం, ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలొ ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్టు, అగస్త్యుడి తమ్ముడు కనుక ఆయనని అగస్త్య భ్రాత అని పిలిచేవారు) ఆశ్రమం కనబడుతుంది. నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో. మరునాడు ఉదయం అక్కడనుంచి బయలుదేరి వెళితే, నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతోంది. అక్కడినుంచి ముందుకి వెళితే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు” అన్నాడు. సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి వద్ద ఆశీర్వాదం తీసుకొని … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 9 & 10
  • శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 7 & 8
    *శ్రీమద్రామాయణం***అరణ్యకాండ – 7* తపస్సు చేస్తూ మధ్య మధ్యలో ఆ ఖడ్గం వంక చూసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, ఊరకనే మధ్యలో ఆ ఖడ్గాన్ని చూడడం కష్టమవుతోందని, ఆ ఖడ్గం మీద చెయ్యి పెట్టి తపస్సు చేసేవాడు ఆ ఋషి. అలా ఖడ్గం మీద చెయ్యి వేసి తపస్సు చెయ్యడం వలన ఆ ఋషిలో రజోగుణం ప్రకోపించి, ఖడ్గాన్ని పట్టుకొని తిరగడం ప్రారంభించాడు. కొంతకాలానికి ఆ ఖడ్గంతో అడవిలోని చెట్లని, కొమ్మలని నరకాలనిపించింది. తరువాత మృగాలని చంపాలనిపించింది. తరువాత దారిదొంగతనాలు చెయ్యాలనిపించింది. తరువాత కొన్నాళ్ళకి ఆ ఖడ్గంతో హత్యలు చెయ్యాలనిపించింది. రామా! ఇంద్రుడు ఏమీ చెయ్యలేదు. కేవలం ఒక కత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఋషి పెద్ద హంతకుడై శరీరాన్ని విడిచి పెట్టేసాడు. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు ఈ కోదండం, బాణాలు ఎందుకు పెట్టు కుంటున్నారు? ఆశ్రమం కట్టుకొని 14 సంవత్సరాలు తపస్సు చేసుకుంటే, మనం … Continue reading శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 7 & 8

• • •

Leave a comment

Leave a comment