నంది శివుడికి వాహనమెలా అయ్యాడు

శివుడు.. ఈ పేరు వింటే పార్వతి, గంగ, నాగేంద్రుడు గుర్తుకొస్తారు. అలాగే మరోపేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది. అదే నంది. 'నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్లినా నందిని తీసుకువెళ్తాడు'. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు నందికి.. కైలాసంలో శివుడితో పాటు ఉంటూ.. శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది?. అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే.పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో.. శివుడ్ని తలుచుకుంటూ తపస్సు … Continue reading నంది శివుడికి వాహనమెలా అయ్యాడు

నిందా స్తుతి సమయంలో

నిందా స్తుతి సమయంలో .....సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే " ఈ సముద్రం మహా దొంగ"అని రాశాడు. కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో "ఈ సముద్రం గొప్ప దాత" అని రాశాడు. ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ‘ "ఈ సముద్రంనా … Continue reading నిందా స్తుతి సమయంలో

తపశ్శక్తి

మనిషి స్వప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు. అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి. అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు. తపస్సుచేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెబుతాయి. నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారట. పరమశివుణ్ని పతిగా పొందేందుకు గౌరీదేవి, గంగను భువికి తెచ్చేందుకు భగీరథుడు, పాశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు, మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సుచేసి సాధించారని మన పురాణాలు చెబుతాయి.రామనామం రామపాదం రామకార్యాలనే తపస్సుగా చేసుకుని, ఒక … Continue reading తపశ్శక్తి