Sundrakanda – సుందరకాండ

Sundrakanda

జై శ్రీరామ్

*Om Apadamapa Hataram Dataram sarva sampadam loka Bhi rāmam śrī rāmam bhūyo bhūyo Namam-yaham*🙏


*Meaning*
*I bow to that Lord Rama who is ever beautiful* *who destroys all dangers and gives all sorts of wealth*.

*ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్* |
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్* ||

My Latest Posts

• • •

  • శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం
    శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వాకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః || ధ్యానం ||వామే కరే వైరిభీతం వహన్తంశైలం పరే శృంఖలహారిటంకం |దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రంభజే జ్వలత్కుండలమాంజనేయమ్ || 1 || సంవీతకౌపీన ముదంచితాంగుళింసముజ్జ్వలన్మౌంజిమథోపవీతినంసకుండలం లంబిశిఖాసమావృతంతమాంజనేయం శరణం ప్రపద్యే || 2 || ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతేఅకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 3 || సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహతాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే || 4 || ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణేప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 || సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తుతే || 6 || వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసేబ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే || 7 || రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || 8 || కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటేజలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే … Continue reading శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం
  • ఆంజనేయ దండకం
    శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి, కిష్కింధకేతెంచి, శ్రీరామ కార్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, … Continue reading ఆంజనేయ దండకం
  • సుందరకాండ – 38 & 39
    సుందరకాండ – 38 ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దధిముఖుడి సైన్యం వస్తే, వాళ్ళని చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. ఆ తరువాత వచ్చిన దధిముఖుడిని కూడా చావగొట్టారు. అప్పుడాయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. దధిముఖుడు సుగ్రీవుడితో వానర బాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో “హనుమ” అంటున్నాడు. దధిముఖుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతోంది. (వానరాలు ఏదన్నా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెంచుతారు). ఒక పక్క దధిముఖుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచడం గమనించిన లక్ష్మణుడు కంగారుగా “అసలు ఏమయ్యింది” అన్నాడు. “ఏమీలేదయ్యా! దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరాలు మధువనాన్ని నాశనం చేశాయట. దక్షిణ దిక్కుకి వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు” అని లక్ష్మణుడితో అని, “వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను” అని సుగ్రీవుడు దధిముఖుడితో అన్నాడు. దధిముఖుడు ఆ వానరాలకి “సుగ్రీవుడు రమ్మంటున్నాడు” అని … Continue reading సుందరకాండ – 38 & 39
  • సుందరకాండ – 36 & 37
    సుందరకాండ – 36 వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. అప్పుడాయన అనుకున్నాడు ‘అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు. సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది? నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు. అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు’ అని అనుకుని, ‘ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను’ అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు. వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ … Continue reading సుందరకాండ – 36 & 37
  • సుందరకాండ – 34 & 35
    సుందరకాండ – 34 హనుమని చూసిన రావణుడు భయపడి ‘ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు. ఇంతకుముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను. కానీ వాళ్ళెవరికి ఇంత పరాక్రమము, సామర్ధ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, ‘వానరములు నా కొంప ముంచుతాయని’. బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో’ అనుకొన్నాడు. అప్పుడు హనుమంతుడు అన్నాడు “నేను రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా యదార్ధ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు. సుగ్రీవుడి సచివుడిని. కిష్కింధా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా! ఆ వాలిని ఒకే ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు. ఆ సుగ్రీవుడు నీ కుశలమడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు. రాముడిలా నరుడిని కాదు. … Continue reading సుందరకాండ – 34 & 35
  • సుందరకాండ – 32 & 33
    సుందరకాండ – 32 వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడాయన విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే అయిదుగురు అగ్ర సేనానాయకులను పిలిచి “మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను. వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహా భూతం అయ్యి ఉంటుంది” అన్నాడు. ఆ అయిదుగురు సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ నలిగిపోయాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు. … Continue reading సుందరకాండ – 32 & 33
  • సుందరకాండ – 30 ( జయ మంత్ర) & 31
    సుందరకాండ – 30 హనుమంతుడు సీతమ్మ వద్ద సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి “లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము. ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో! కానీ దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగూ ఇవ్వడు. అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదావనాన్ని(అశోక వనం) నాశనం చేస్తే వాడే నన్ను పిలుస్తాడు” అని అనుకొని, భీమరూపుడై ఆ అశోకవనం మీద ఎగిరాడు. అప్పుడాయన తొడల వేగానికి అక్కడున్న చెట్లు విరిగిపోయాయి. అలాగే హనుమ చేసిన మహా నాదానికి అక్కడున్న పక్షులు గుండెలు బద్దలై కిందపడిపోయాయి. ఆయన అక్కడున్న సరోవరాలలోని నీళ్ళని బయటకి తోసేశాడు. అలా హనుమ చేస్తున్న విధ్వంసానికి అక్కడున్న రాక్షసులు ఉలిక్కిపడి లేచారు. అక్కడున్న రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వచ్చి “ఈ కోతి చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ చెట్టు మీద కూర్చుని ఉండడం … Continue reading సుందరకాండ – 30 ( జయ మంత్ర) & 31
  • సుందరకాండ – 28 & 29
    సుందరకాండ – 28 మళ్ళీ ఆ కాకాసురుడనే ఆ కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మరొకసారి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని లాగింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదిటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చూచేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. ఆయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ‘ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు’ అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు). అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని (గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి (మంత్ర పూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలే అవసరంలేదు. ఏ వస్తువు మీదైనా ఆ మంత్రాన్ని అభిమంత్రించి … Continue reading సుందరకాండ – 28 & 29
  • సుందరకాండ – 26 & 27
    సుందరకాండ – 26 హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ “నాయనా హనుమా! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా?” అని పలు ప్రశ్నలు అగిగాక, “రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు. నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లవ్యాన్ని పొందలేదు కదా? రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా? లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా? నన్ను తలుచుకుంటున్నాడా? రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు. అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు … Continue reading సుందరకాండ – 26 & 27
  • సుందరకాండ – 24 & 25
    సుందరకాండ – 24 తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి (స్వప్నంలో వానరము కనపడితే కీడు జరుగుతుందని అంటారు) “లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి. నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి” అని అన్నాక, సీతమ్మ అనుకుంటోంది ‘అసలు నాకు నిద్ర వస్తేకదా కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను’ అని అనుకుని మళ్ళీ పైకి చూసింది. చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు సీతమ్మ అన్నది “ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం. అగ్నిదేవుడికి నమస్కారం. బ్రహ్మగారికి నమస్కారం. ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక” అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది. అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి “అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి … Continue reading సుందరకాండ – 24 & 25
  • సుందరకాండ – 22 & 23
    సుందరకాండ – 22 అప్పుడు సీతమ్మ “నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక, నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినపడతాయి” అని, ఈ లంకని పాలిస్తున్న రావణుడికి, ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనిక లేదు. అందుకనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తరువాత రావణుడి చేతిలో మరణించడం కన్నా ఇప్పుడే మరణించడం ఉత్తమం అనుకొని ‘కాలమే మృగ స్వరూపంలో వచ్చి నన్ను మొహపెట్టింది, నేను అల్ప భాగ్యం ఉన్నదానిని. అందుకనే ఆ మృగాన్ని చూసి మోహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి, రాముడిని వదిలేసిన వెంటనే అన్నీ పోయాయి. రాముడి తరవాత పుట్టిన వాడిని వదిలాను, లక్ష్మణుడికి ముందు పుట్టినవాడు దూరం అయ్యాడు. రామా! రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోభాపెట్టాలని … Continue reading సుందరకాండ – 22 & 23
  • సుందరకాండ – 20 & 21 (త్రిజట వృత్తాంతం)
    సుందరకాండ – 20 (త్రిజట వృత్తాంతం) అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి “ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటినుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతుంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను” అన్నది. ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అన్నది “నేను బయట పడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కానీ హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను. ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకొని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగు అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని, కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది” అన్నది. అప్పుడు మిగతా రాక్షస స్త్రీలు, నావి కాళ్ళు, నావి తొడలు, నావి … Continue reading సుందరకాండ – 20 & 21 (త్రిజట వృత్తాంతం)
  • సుందరకాండ – 18 & 19
    సుందరకాండ – 18 రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తీసుకొని, దానిని తనకూ రావణునకూ మధ్యలో పెట్టి “రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు. వాళ్ళతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగన్నా బతకవచ్చు. కానీ చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్నా, చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు. కానీ ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు. శరణు అన్నవాడిని రాముడు ఏమీ చెయ్యడు. ‘నేను సీతని తీసుకొచ్చాను’ అంటావేమిటి? నీ జీవితంలో నువ్వు నన్ను తీసుకురాలేవు. సూర్యుడి నుంచి సుర్యుడి కాంతిని వేరు చేసి తేగలవా? వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా? పువ్వు నుంచి … Continue reading సుందరకాండ – 18 & 19
  • సుందరకాండ – 16 & 17
    సుందరకాండ – 16 సీతమ్మని అలా చూసిన హనుమంతుడు అనుకున్నాడు “మా రాముడి గుండె చాలా గట్టిది. ఎవ్వరూ చెయ్యలేని పని రాముడు చేశాడని ఇప్పుడు నేను గుర్తించాను. అదేమిటంటే, పది నెలలనుంచి ఈ సీతమ్మ రాముడి పేరు చెప్పుకుంటూ, తపస్సు చేసుకుంటూ, రాముడి గురించి శోకిస్తూ ఇక్కడ ఉంటే, అటువంటి భార్యకి దూరంగా ఉండి కూడా 10 నెలలనుంచి ప్రాణాలు నిలబెట్టుకొని ఉన్నాడు. కనుక రాముడు ఎవ్వరూ చెయ్యలేని పని చేశాడు. రాముడి మనస్సు సీతమ్మ వద్ద ఉంది. సీతమ్మ మనస్సు రాముడి వద్ద ఉంది. అందుకని ఇద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండి కూడా ఇంత కాలం బతకగలిగారు. మూడు లోకములలో ఉండే ఐశ్వర్యాన్ని అంతా తీసుకొచ్చి ఒకపక్క పెట్టి, మరోపక్క సీతమ్మని పెడితే, సీతమ్మ యొక్క వైభవంలో 16వ వంతుతో కూడా ఆ ఐశ్వర్యము, వైభవము సరితూగదు. నల్లటి జుట్టుతో, ఎర్రటి పెదవితో, సన్నటి నడుముతో, పద్మములవంటి … Continue reading సుందరకాండ – 16 & 17
  • సుందరకాండ – 14 & 15
    సుందరకాండ – 14 అక్కడినుండి ముందుకి వెళ్ళగా, రకరకాలైన బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు, పువ్వులనుండి తీసిన సుర, పళ్ళనుండి తీసిన సుర, తేనెనుండి తీసిన సురలు మధురమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ తాగేసిన పాత్రలు, సగం తాగి కిందపడేసిన పాత్రలు దొర్లుతున్నాయి. స్త్రీలు ఒకరిమీద ఒకరు ఉండరాని విధంగా మత్తులో పడి ఉన్నారు. హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అప్పుడాయన అందరూ ఆహారం తీసుకునే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నెమళ్ళ మాంసం, కోళ్ల మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవిపందుల మాంసం అలా రకరకాలైన పదార్ధాలు ఉన్నాయి. హనుమ ఆ ప్రాంతాన్నంతటినీ వెతికారు. మళ్ళీ పుష్పక విమానంలోకి వెళ్ళి, అందులో వెతికి కిందకి దిగుతూ అనుకున్నారు “ఈ లంకా పట్టణం అంతా వెతికాను. ఇందులో వెతకని ఇల్లు లేదు. ఇక్కడ గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలు, రాక్షసులు కనపడుతున్నారు కానీ సీతమ్మ … Continue reading సుందరకాండ – 14 & 15

• • •