శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 11 & 12

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 11*

“స్వామీ! మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము” అని రాముడు అడుగగా, అగస్త్యుడు “నిన్ను నేను నాతోపాటే ఈ ఆశ్రమంలోనే ఉండు అని అనాలని అనుకున్నాను. కానీ నా తపః శక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను. నీ కోరిక ఏమిటో నాకు అర్ధమయ్యింది. అందుకని రామా! ఇక్కడికి దగ్గరలో పంచవటి అనే గొప్ప వనం ఉంది. అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో. అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ. నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో” అన్నారు.

సీతారామలక్ష్మణులు అగస్త్య మహర్షి వద్ద సెలవు తీసుకొని, ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు. వారు అలా వెళుతుండగా ఒక చెట్టు మీద పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనబడింది. ఆ పక్షి రాముడిని చూసి, నేను మీతో వస్తాను అన్నది. అప్పుడు రాముడు “నువ్వు ఎవరు” అని అడుగగా, ఆ పక్షి ఇలా చెప్పసాగింది. “నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని. ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి యొక్క 60 కుమార్తెలలో 8 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ ఎనిమిదిమందే అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల. అప్పుడు కశ్యపుడు తన 8 మంది భార్యలని పిలిచి “మీరు క్షేత్రములు కనుక, నా యొక్క తేజస్సు చేత, నాతో సమానులైన వారిని కనండి” అన్నాడు. ఆయన మాటలని కొంతమంది భార్యలు విన్నారు. కొంతమంది వినలేదు. అదితికి 12 మంది ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, ఇద్దరు అశ్వినులు జన్మించారు. అలా మొత్తం 33 మంది దేవతలు అదితికి జన్మించారు. దితికి దైత్యులు జన్మించారు. ధనువుకి హయగ్రీవుడు జన్మించాడు. ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు.

కశ్యపుడి మాట వినని భార్యలైన కాళికకి నరకుడు, కాలకుడు అనే ఇద్దరు జన్మించారు. తామ్ర కి క్రౌంచి, భాసి, శ్యేని, ధృతరాష్ట్రీ, శుకి అనే 5 కన్యలు జన్మించారు. మళ్ళీ క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి. భాసికి భాస పక్షులు పుట్టాయి. శ్యేనికి డేగలు, గ్రద్దలు పుట్టాయి. ధృతరాష్ట్రీకి హంసలు, చక్రవాకములు పుట్టాయి. శుకి కి నత అనే పిల్ల పుట్టింది. నతకి వినత అనే పిల్ల పుట్టింది. ఆ వినతకి గరుడుడు, అరుణుడు అనే ఇద్దరు పుట్టారు. నేను ఆ అరుణుడి కుమారుడిని. నా పేరు జటాయువు. నా అన్నగారి పేరు సంపాతి.

అలాగే క్రోధవశ కి మృగీ, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు పుట్టాయి. మృగమందకి ఎలుగుబంట్లు పుట్టాయి. హరికి సింహాలు, బలమైన వానరాలు పుట్టాయి. భద్రమదకి ఇరావతి అనే పిల్ల పుట్టింది. ఆ ఇరావతికి ఐరావతం పుట్టింది. మాతంగికి ఏనుగులు పుట్టాయి. శార్దూలికి కొండముచ్చులు, పులులు పుట్టాయి. శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గోవులు, గంధర్వులు మొదలైనవి పుట్టాయి. సురసకి అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి. కద్రువకి సాధారణమైన సర్పములు పుట్టాయి.

రామా! ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? కనబడేటటువంటి ఈ పక్షులు, మృగాలు, పశువులు అన్నీ కశ్యప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే” అని అన్నాడు ఆ జటాయువు. ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడినుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు.
*శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 11 – సంపూర్ణం*

{ఈనాటి కథా భాగంలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. ప్రముఖుల పుట్టుకలు వివరంగా చెప్పబడ్డాయి. గమనించండి.}

*శ్రీమద్రామాయణం*

*అరణ్యకాండ – 12*

రాముడు, సీత, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి “లక్ష్మణా! అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి, కావలసినంత నీరు దొరికేటటువంటి, దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సంవృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి, అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు” అన్నాడు.

*[పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |*
*స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||]*

అప్పుడు లక్ష్మణుడు “స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి? నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరము లకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి. నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు” అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి “లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది. దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి. ఆ పర్వత చరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారండవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి. ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనలను ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది. అందుకని లక్ష్మణా! నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు” అన్నాడు.

ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి, మట్టిని తీసి, నీరు పోసి, ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు. వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు. దానిమీద అడ్డుకర్రలు వేశాడు. వాటిమీద జమ్మి మొదలైన కర్రలు, దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి, కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేసించేముందు చేసేటటువంటి శాంతికర్మలన్నిటిని నిర్వహించి సీతారాముల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని “అన్నయ్యా! నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను. వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి, బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను” అని అన్నాడు. (ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చెయ్యడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు. అదే ఆయన లక్ష్మి, అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణా అని పేరు పెట్టారు)

*

శ్రీమద్రామాయణం

అరణ్యకాండ – 12

రాముడు, సీత, లక్ష్మణుడు, జటాయువు పంచవటిని చేరుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి “లక్ష్మణా! అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము. అందుచేత ఇక్కడ సమతలంగా ఉండి, కావలసినంత నీరు దొరికేటటువంటి, దర్భలు, పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి దొరికేటటువంటి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సంవృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి, అక్కడ ఒక పర్ణశాలని నిర్మించు” అన్నాడు.

[పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||]

అప్పుడు లక్ష్మణుడు “స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి? నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరము లకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి. నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు” అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి “లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది. దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి. ఆ పర్వత చరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారండవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి. ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనలను ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది. అందుకని లక్ష్మణా! నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు” అన్నాడు.

ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి, మట్టిని తీసి, నీరు పోసి, ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు. వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు. దానిమీద అడ్డుకర్రలు వేశాడు. వాటిమీద జమ్మి మొదలైన కర్రలు, దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి, కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేసించేముందు చేసేటటువంటి శాంతికర్మలన్నిటిని నిర్వహించి సీతారాముల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని “అన్నయ్యా! నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను. వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి, బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను” అని అన్నాడు. (ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చెయ్యడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు. అదే ఆయన లక్ష్మి, అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణా అని పేరు పెట్టారు)

శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 12 – సంపూర్ణం

Leave a comment