మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం లో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం… ఈ ఆర్టికల్ లో చాలా అద్భుతంగా వర్ణించారు

*మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం లో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం... ఈ ఆర్టికల్ లో చాలా అద్భుతంగా వర్ణించారు* పంచశత శక్తి పీఠములలో మధుర మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాలనేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలము కలగలిపిన మరకత మణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత. మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ … Continue reading మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం లో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం… ఈ ఆర్టికల్ లో చాలా అద్భుతంగా వర్ణించారు

శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి

తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు. వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళలో పడితే చూపు పోతుందని భయపడతారు. కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారుచేస్తున్నారు. జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. వంగపూవు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరొకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల … Continue reading శ్వేతార్క లేదా తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి

జ్వాలాముఖి క్షేత్రం

హిమాలయాల ప్రాంతంలో వెలసిన విశేషమైన శక్తి కల్గిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పిలవబడుతున్నదే జ్వాలాముఖీ క్షేత్రం. అలనాడు పార్వతీ దేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుండడం విశేషం. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. జ్వాలాముఖి విశేషాలు శక్తి పీఠాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో … Continue reading జ్వాలాముఖి క్షేత్రం

నిమిషాంబ దేవాలయము

కర్నాటకలో బెంగుళూరు నుండీ మైసూరుకు వెళ్ళే దారిలో ’ మండ్య ’ దాటినతరువాత వచ్చే శ్రీరంగపట్టణము అనే ఊరు చాలా ప్రసిద్ధమైనది. ఒకప్పుడు మైసూరు రాజ్యానికి ఇదే రాజధాని. శ్రీరంగ పట్టణానికి అతి సమీపములో ఈ నిమిషాంబ దేవస్థానము ఉంది. శ్రీరంగ పట్టణము అనగానే గుర్తొచ్చేవి, శ్రీ రంగనాథ ఆలయము , మరియూ ఈ నిమిషాంబ దేవస్థానము. ఈ నిమిషాంబ దేవస్థానానికి ఒక ఆసక్తికరమైన స్థల పురాణము ఉంది. పురాణ కాలములో ’ సుమనస్కుడు ’ అనే … Continue reading నిమిషాంబ దేవాలయము

మాఘ మాసం” విశిష్టత

మాఘ మాసం" విశిష్టత "మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి "శుక్ల పక్ష చవితి" దీనిని "తిల చతుర్థి"అంటారు. దీన్నే "కుంద చతుర్థి" అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో … Continue reading మాఘ మాసం” విశిష్టత

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది…

ఇంట్లో ప్రతిరోజూ..గొడవలు..తగాదాలు..అశాంతి.. వాతావరణం వుంటే..ఆయా ఇళ్లలో పూజా కార్యక్రమాలు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని పండితులు, పురోహితులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఏదైనా ఇంట్లోగానీ లేదా ఎవరితోనైనాగాని ఎల్లప్పుడూ అశుభం జరగడం, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటే... అప్పుడు వారి గ్రహస్థితిలో ఏవో మార్పులు వున్నాయిని తెలుపుతారు జ్యోతిష్యులు. అప్పుడు వాటికి సంబంధించిన యజ్ఞాలు, శాంతులు, జపాలు చేయిస్తే.. వాటి ప్రభావం తగ్గుతుందని శాస్త్రాల ప్రకారం చెబుతుంటారు. అయితే ఇలా కాకుండా సాధారణంగా ఏదైనా ఒక … Continue reading ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది…