*ఉర్వారుక మివ బంధనం……..’*

ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు. *'త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా … Continue reading *ఉర్వారుక మివ బంధనం……..’*

మనకు తెలియని మహాభారత యోధుడు- బర్బరీకుడు

బర్బరీకుని గురించి మనకు అంతగా మహాభారత సమయ యోధునిగా తెలియదు. ఇతని వృత్తాంతం వివరంగా స్కాందపురాణం మహేశ్వర ఖండంలో చెప్పబడి వుంది. ఇతని చరిత్ర ఇతః పూర్వం మనం చర్చించుకున్న ఇరావంతునికి ఆపాదించి కొన్ని జానపదకధలు పుట్టుకొచ్చాయి. ఇతని వృత్తాంతం పూర్తిగా చదివితే ఎన్నో విషయాలు మనకు అవగతమవుతాయి. ఒకసారి పాండవులు అందరూ సభలో శ్రీకృష్ణుని సముఖాన సభచేసి వుండగా ఘటోత్కచుడు వచ్చి తమ తండ్రులకు ప్రణమిల్లి ప్రేమతో యుధిష్టరుని తొడపై కూర్చోపెట్టుకుని వుండగా అతడికి సరైన … Continue reading మనకు తెలియని మహాభారత యోధుడు- బర్బరీకుడు

మహావృక్షంగామారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరాన్ని నశింపచేయడం లేదా?

"మహావృక్షంగామారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరాన్ని నశింపచేయడం లేదా? అలాగే స్వార్ధ పరిత్యాగంచేతనే ఘనకార్యములు సాధించబడతాయి." --- Swami Raama Teertha అది లాహోర్ విశ్వవిద్యాలయం, 1892 సంవత్సరంలో బి.ఏ. గణితశాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రంలో 13 ప్రశ్నలిచ్చి ఏ తొమ్మిదింటికైనా జవాబులు వ్రాయమని అడిగారు. ఒక విద్యార్థి 13 ప్రశ్నలకూ జవాబువ్రాసి పై వాటిలో ఏ తొమ్మిదింటినైనా పరీక్షించుకోవచ్చునని అడుగున వ్రాశాడు. ఆ విద్యార్థికి విశ్వవిద్యాలయంలో ప్రధమస్థానం లభించింది! అతడే స్వామి రామతీర్థయని పేరుగాంచిన … Continue reading మహావృక్షంగామారడానికి విత్తనం మొదట భూమిలో తన శరీరాన్ని నశింపచేయడం లేదా?

*బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి*.

🔯🔯🔯🔯🔯🔯 🌺మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టులేని ముఖము, ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,దరిద్రదేవత తాండవం … Continue reading *బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి*.

సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం

సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి.శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే రోగాలు దరిచేరవు. 1::ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు 2::నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ 3::కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు … Continue reading సర్వరోగ నివారణ సూర్య స్తోత్రం

“నాకు కాళి కావాలి, అంతే!”..రామకృష్ణ పరమహంస

రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువకాలం తీవ్రమైన భక్తునిగా జీవించాడు. ఆయన కాళిమాత భక్తుడు. ఆయనకు కాళి ఒక దేవత కాదు, సజీవ సత్యం. ఆమె ఆయన ముందు నాట్యమాడేది, ఆయన చేతులతోనే భోజనం ఆరగించేది, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేది. తరువాత ఆయనని పరమనందానుభూతిలో వదిలేసేది. ఇది నిజంగానే జరిగేది. ఇదేదో ఊహాజనితం కాదు, ఆయన నిజంగా తినిపించేవాడు. రామకృష్ణుల చైతన్యం ఎంత స్పష్టమైనదంటే ఆయన ఏ రూపం కోరుకుంటే ఆరూపం ఆయనకి నిజంగా … Continue reading “నాకు కాళి కావాలి, అంతే!”..రామకృష్ణ పరమహంస

రామాయణం *మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం*

*రామాయణం* మనుషులు తమ జంతు ప్రవృత్తిని వీడి ఒక సమాజంగా రూపొందుతున్న కొత్తల్లో మనసులో ఎన్నో సందేహాలు.. ఏది మంచి? ఏది చెడు? ఒక వేళ మంచి అయితే ఎందుకు మంచి? చెడయితే ఎలా చెడు? ఒక మానవ నాగరికత కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాటంకంగా, ఎటువంటి వడిదుడుకులు లేకుండా సాగిపోవాలంటే ఏమి చెయ్యాలి? ఇక్కడ వుండే రకరకాలయిన మనుషుల్ని ఒక దారిలో నడిపించడం ఎలా అన్న విషయంపై ప్రాచీన భారత దేశంలో జరిగినన్ని ప్రయోగాలు … Continue reading రామాయణం *మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం*

*న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు*

*న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు* న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు. సూర్యుడు శ్రీ‌కాకుళం జిల్లా 1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి తూర్పుగోదావ‌రి 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి తూర్పగోదావ‌రి 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి క‌ర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి చంద్రుడు ప‌శ్చిమ గోదావ‌రి 1. గునుగుపూడిలో సోమేశ్వర … Continue reading *న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు*