మహిమాన్విత దేవాలయాలు వింతలు -విశేషాలు

మన అమ్మలనుగన్న అమ్మ పార్వతిమాత తన తనయనుకి భుాలోకములో వింతలు -విశేషాలు ఇలా చెప్పుచున్నది సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 5. మొగిలీశ్వర్. 6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా. *నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:* 1. మహానంది 2. జంబుకేశ్వర్ 3. బుగ్గరామలింగేశ్వర్ 4. కర్ణాటక … Continue reading మహిమాన్విత దేవాలయాలు వింతలు -విశేషాలు

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

🌹శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి*🌹దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసు కుందాము!పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందు టకై! దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకా సురుడు … Continue reading శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి “పిప్పలాదుడు”

శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి "పిప్పలాదుడు"త్రేతాయుగంలో ఒక సమయంలో వానలు పడక విపరీతమైన కరువు ఏర్పడింది. ఆ కరువు కాలంలో తన కుమరుడుని పోషించలేకపోయిన కౌశికుడు అనే మహర్షి ఆ పిల్లవాడిని అడవులలో వదిలి వెళ్ళిపోయాడు. తరువాత మహర్షి అయిన పిప్పలాదుడు తన గురువు నారద మహర్షిని ధ్యానించి, ప్రార్థించి తాను ఎందువల్ల తన తల్లిదండ్రులకు దూరమైందీ చెప్పవలసిందిగా వేడుకున్నాడు. ‘‘శనేశ్వరుని క్రూర దృష్టివల్ల నువ్వు నీ తల్లిదండ్రులకు దూరమయ్యావు’’ అని నారద మహర్షి చెప్పాడు. అందుకు ఆగ్రహించిన … Continue reading శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి “పిప్పలాదుడు”

శివ తాండవ స్తోత్రం – తెలుగు తాత్పర్యము

శివ తాండవ స్తోత్రం – తెలుగు తాత్పర్యము 1) జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || తాత్పర్యము: జటాఝూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడతో – మెడలోని సర్పహారము మాలలా వ్రేలాడుచుండగా – చేతిలోని ఢమరుకము ఢమ ఢమ ఢమ ఢమ యని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు- శివుడు – మాకు సకల శుభములను ప్రసాదించుగాక. 2) … Continue reading శివ తాండవ స్తోత్రం – తెలుగు తాత్పర్యము

ఉత్తమ గురువు లక్షణాలు

గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి. 1 సర్వజ్ఞత - ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు. 2 సర్వ వ్యాపకత - ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి 3 సర్వ సమర్ధత - తాను శిష్యుడిని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాండ నియమాలను సహితం మార్చగలిగేంతగా. ఇటువంటి వారిని … Continue reading ఉత్తమ గురువు లక్షణాలు