శ్రీ హయగ్రీవ స్తోత్రం / Sri Hayagreeva Stotram

జ్ఞానానన్దమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||౧|| స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః ||౨|| సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం హరత్వంతర్ధ్వాన్తం హయవదనహేషాహలహలః ||౩|| ప్రాచీ సన్ధ్యా కాచిదన్తర్నిశాయాః ప్రజ్ఞాదృష్టే రఞ్జనశ్రీరపూర్వా వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః ||౪|| విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే ||౫|| అపౌరుషేయైరపి వాక్ప్రపంచైః అద్యాపి తే భూతిమదృష్టపారాం … Continue reading శ్రీ హయగ్రీవ స్తోత్రం / Sri Hayagreeva Stotram

*మహోన్నత మానవజన్మ*

ఒకానొక పట్టణమున ఒక బీద గృహస్థుడు కలడు. అతని కుటుంబము పెద్దది. రాబడి తక్కువ. కుటుంబ పోషణార్ధము అతడు పడరాని పాట్లు పడుచుండెను. సంసారనిర్వహణము అతనికి ఎంతయో భార భూతముగా తోచుచుండెను. ఇట్లుండ ఒకనాడాతని ఇంటిముందుగా ఒక సాధువు పోవుచుండెను. మహాత్ముల ఆశీర్వచన ప్రభావముచే కార్య సిద్ధి కలుగునని నిశ్చయించి ఆ గృహస్థుడు అమాంతముగ ఆ సాధువు కాళ్ళపైబడి "పాహి మాం పాహి మాం" అని విలపించెను. మఱియు "మహాత్మా! నేను కడుబీదవాడను. కుటుంబము చాలాపెద్దది, పోషించుటకు … Continue reading *మహోన్నత మానవజన్మ*

దశ మహావిద్యలంటే ఏవి?

దశ మహావిద్యలంటే ఏవి? 1. కాళీ 2. తార 3. త్రిపుర సుందరి 4. ధూమావతి 5. భువనేశ్వరి 6. భైరవి 7. ఛిన్నమస్త 8. మాతంగి 9. బగళాముఖి 10. కమలాత్మిక అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా … Continue reading దశ మహావిద్యలంటే ఏవి?

ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే,

ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే, ఈ మనస్సు ద్వారానే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు లభిస్తాయి. కాని అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేస్తే నీచమైపోతుంది. సంసారంలో ఉన్నది కేవలం కామినీ కాంచనాల చింతనే. సంసారం నీళ్ళ వంటిది. మనస్సు పాల వంటిది. పాలను నీళ్ళలో పోస్తే పాలు, నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చెయ్యలేం. అదే పాలను తోడు పెట్టి, పెరుగు చిలికి వెన్నతీసి ఆ వెన్నను నీళ్ళలో వేస్తే అప్పుడే అది తేలుతుంది. … Continue reading ఏకాంతంలో భగవచ్చింతన చేసుకుంటే,

దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం

దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అనంత పద్మనాభ స్వామి మహిమలు అనంతం మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదల పాలయ్యాయి . అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురం లోను వరదలు వచ్చాయి . స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మ తీర్ధం నిండిపోయింది , ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది . దాంతో మూడు రోజుల పాటు స్వామి … Continue reading దేవతలు అనంత పద్మనాభస్వామిని పూజిస్తారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం

వరలక్ష్మి వ్రతం (పూజా విధానం )….!!

వరలక్ష్మి వ్రతం(పూజా విధానం )....!! శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :- పసుపు ................. 100 grms కుంకుమ ................100 grms గంధం .................... 1box విడిపూలు................ 1/2 kg పూల మాలలు ........... 6 తమలపాకులు............ 30 వక్కలు..................... 100 grms ఖర్జూరములు..............50 grms అగర్బత్తి ....................1 pack కర్పూరము.................50 grms చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins ) తెల్ల టవల్ .................1 బ్లౌస్ పీసులు .............. 2 … Continue reading వరలక్ష్మి వ్రతం (పూజా విధానం )….!!

అనంత ఆశ అనర్థదాయకం

ధనం ఎల్లప్పుడూ నిరర్థకమైనది, ప్రమాదకరమైనది. సుఖశాంతులని దూరం చేస్తుంది. నీరు పల్లానికి పారడము ఎంత సహజమో, అగ్ని పైకి ఎగిసిపడడం ఎంత సహజమో, ధర్మం సద్గతి ప్రసాదించడం ఎంత సహజమో అంతే సహజంగా ధనం అనర్థం కలిగిస్తుంది. ఇక అధిక సంపాదన కలవానికి కుమారుడి నుండి కూడా భయము కలుగుతుంది. అది అక్రమ సంపాదన అయితే.. తండ్రిని ఆదర్శంగా తీసుకొని కొడుకూ అదే పనిచేస్తాడు. ఆస్తిని అనుభవించడానికి.. తండ్రి మరణం కోసం ఎదురుచూస్తాడు. ఎందుకూ కొరగానివాడవుతాడు. పశువులు … Continue reading అనంత ఆశ అనర్థదాయకం

సన్యాసి – వేశ్య

భౌతికంగా జరిగే మార్పుల వల్ల మనుషుల్లో ఎట్లాంటి పరివర్తనా జరగదు. మానసికమయిన మార్పులవల్లే మనుషుల్లో పరివర్తన కలుగుతుంది. మనసులో కాంతి ఉంటే ఆచరణలో కూడా ఉంటుంది. తమని తాము మార్చుకోవాలని ఆశించే వాళ్లని ఆశ వెంటాడుతుంది. వాళ్లు హృదయ పరివర్తన గురించి ఆలోచించరు. పైపై మార్పులతో తృప్తి పడిపోతారు. మనిషి నిత్యచైతన్యంతో ఉండాలి. తను బాహ్యమయిన మార్పుల్ని కోరుకుంటున్నాడా? అంతరంగికమైన పరివర్తనని కోరుకుంటున్నాడా? అన్న స్పృహతో ఉండాలి. అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. లేకుంటే అంతా అస్తవ్యస్తమవుతుంది. … Continue reading సన్యాసి – వేశ్య

ఆంజనేయుడి జన్మ రహష్యం తెలుసుకుందాం.

తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చినా చెడ్డపేరు వచ్చినా అది సంతానం వల్లే.. కులము లో నొకడూ గుణవంతుడైన ఆ కులము వెలయి వాని గుణము చేత అని యోగివేమన అంటాడు. అంజనేయుడి కారణం గా మొత్తం వానర జాతికే విశేష గౌరవం దక్కింది.. తన తల్లికి ఆనందం కలిగించాడు ..సీతమ్మ దుఃఖం దూరం చేసాడు. ఆంజనేయుడి జన్మ రహష్యం తెలుసుకుందాం. పుంజికస్థల అనే అప్సరస శాపం వల్ల వానర స్త్రీగా కుంజరుడు అనే వానరానికి జన్మించింది.ఆమెకు అంజనాదేవి … Continue reading ఆంజనేయుడి జన్మ రహష్యం తెలుసుకుందాం.

దేవుడికి దీపం ఎలా వెలిగించాలి??

దేవుడి విగ్రహానికి లేదా పటానికి ధూపధీప నైవేద్యాలు సమర్పించటం మన ఆరాధనా పద్ధతి. ఉదయము వెలిగించు దీపము కన్నా ప్రదోష కాలమందు వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనదిగా పెద్దల మాట. పూజలో అత్యంత ముఖ్యమైన దీపం ఆ తర్వాత ధూపం, పుష్పాలు, పసుపు కుంకుమలు, గంధచందన విభూతులు, కొబ్బరికాయ, అరటిపండ్లు వక్క, తమలపాకులు, మంగళ హారతి మొదలగునవి క్రమానుగతిలో ప్రాధాన్యము కలిగినటువంటివి. కావున పూజ చేయువారిపై వీటి అనుకూల శక్తి, ప్రభావము వెంటనే పడుతుంది. అష్టోత్తరములు మరియు … Continue reading దేవుడికి దీపం ఎలా వెలిగించాలి??