రేపు -" *శని త్రయోదశి* " *01_6_2019* శనిత్రయోదశి *వృషభ , కన్య ,వృశ్చిక, ధనస్సు, మకర రాశుల* వారు వరుసగా "అష్టమ" , "అర్ధాష్టమ" , " ఏలినాటి శని" లతో బాధ పడుతున్న వారు. ఈ శనిత్రయోదశి నాడు ఉదయం "శని హోరకాలంలో" అనగా ఉదయం 6:00 నుండి 7:00 మధ్యకాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు. సాయంత్రం "ప్రదోష వేళలో " అనగా 5:30 నుండి 6:30 మధ్య కాలంలో శివాలయం … Continue reading

శ్రీ లలితా పంచకం

ఓం శ్రీ మాత్రే నమః శ్రీ లలితా పంచకం ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరంపృథులమౌక్తికశోభినాసమ్ ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాడ్యం మండస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రాత్నంగుళీయ లసదంగుళీ పల్లవాడ్యామ్ మాణిక్య హేమవలయాంగద శోభామానాం పుండరేక్షు చాపకుసుమేషుసృణీర్ దధానామ్ ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాననిరతం భావసింధుపోతమ్, పద్మాసనాది సురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజసుదర్శన లాంఛనాడ్యమ్ ప్రాతః స్తువే పరిశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవాద్యాం, విశ్వస్య సృష్టి విలయస్థతి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాజ్ఞ్మనసోతి దూరాం ప్రాతర్వదామి లలితే తవ … Continue reading శ్రీ లలితా పంచకం

శ్రీ గర్భరక్షా స్తోత్రం:

గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ … Continue reading శ్రీ గర్భరక్షా స్తోత్రం:

జపము అనగా … ?

జకారో జన్మవిచ్ఛేదః పకారః పాపనాశనః జన్మచ్ఛేేదకరో యస్మాత్ జపమిత్యభిదీయతే ! జ అంటే జన్మరాహిత్యము, ప అంటే పాపనాశనము. జపము అనగా పాపమును నశింపజేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది. కావున జపమును చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిల్పి, తద్భావమును మధ్య మధ్యలో ధ్యానించుట వలన భావపుష్టితో జపపుష్టి కలిగి తద్వారా మంత్రపుష్టి కలిగి సంపూర్ణ ఫలితము లభించును. మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మననము చేస్తే తరింపజేసేది మంత్రము. అటువంటి శక్తిపూరితమైన మంత్రాన్ని జప ప్రక్రియలో సాధన చేయటానికి … Continue reading జపము అనగా … ?

లలితా సహస్త్రనామ విశిష్టత..

లలితా సహస్త్రనామ విశిష్టత.. లలితా సహస్రనామ స్తోత్రము, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రము. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం. ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం … Continue reading లలితా సహస్త్రనామ విశిష్టత..

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన 1) మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని,మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది 2) సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు,అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు 3) లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు 4) పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు | 5) భువనేశ్వరీ సంకల్పమే … Continue reading మణిద్వీప వర్ణన

ప్రత్యంగిరా నవోస్తుతే

ప్రత్యంగిరా నవోస్తుతే ప్రత్యంగిరా నవోస్తుతే లక్ష సింహ ముఖాలతో... భగభగమండే కేశాలతో... త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి. ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు. అంతటి అరుదైన ప్రత్యంగిరా ఆలయం మన రాష్ట్ర రాజధానిలోనే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణప్రతీతి. కానీ ఉగ్రస్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే … Continue reading ప్రత్యంగిరా నవోస్తుతే

ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడిం

రామాయణం -- 71 ఇంద్రజిత్ మరణించాడన్న వార్త విన్న రావణుడు కూర్చున్న తల్పం మీదనుండి కిందపడి దీర్ఘమూర్చని పొందాడు. తరువాత ఆయన అన్నాడు " నా కుమారుడు ఇంద్రజిత్ ఎవరి చేత సంహరింపబడనివాడు, ఇవ్వాళ ఇంత దారుణంగా మరణించాడు. ఇంక నాకీ జీవితం ఎందుకు. అసలు ఇన్ని ఉపద్రవాలకి కారణం అయిన సీతని సంహరించేస్తాను " అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఆగ్రహంతో తన వైపుకి వస్తున్న రావణుడిని చూసి సీతమ్మ ఒణికిపోయింది. రావణుడు … Continue reading ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడిం

పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

*పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?* పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు. నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు. అయిదోవది అయిన జనలోకంలొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు. ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , … Continue reading పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

పరాశక్తి ‘సప్తమాతృకలూగా అవతరించిది

దేవతా శక్తులే సప్త మాత్రికలు..! సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి. పరాశక్తి ‘సప్తమాతృకలూగా అవతరించిది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు. 1. బ్రహ్మాణి: ఈ మాతృమూతి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి. 2. మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత. 3. కౌమారి: కుమారస్వామి శక్తి. శక్తి (బల్లెం) … Continue reading పరాశక్తి ‘సప్తమాతృకలూగా అవతరించిది