🍀🌺 తీర్థయాత్రలు | List of Holy Places 🌺🍀


🍀🌺 తీర్థయాత్రలు 🌺🍀

తీర్థయాత్రలకు వయసు పైబడ్డాక వృద్ధాప్యంలోనే వెళ్లాలని కొందరు అనుకుంటారు. బాధ్యతలన్నీ పూర్తిచేసిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తుంటారు అనేకమంది. అయితే తీర్థయాత్రలకు వయస్సుతో పనిలేదు. భగవంతుడి నామస్మరణ చేయడానికి వయసుతో సంబంధం లేదు. భగవంతుడి దర్శనం, ఆయన నామస్మరణ , పూజాభిషేకాలు మనకు అనంతమైన పుణ్యఫలితాలను ఇస్తాయి.

అందుకే స్వామిని దర్శించుకునేందుకు వయస్సును అడ్డుపెట్టకూడదు.తీర్థయాత్రలకు వయస్సున్నప్పుడే వెళ్లడం ఉత్తమం. ఇలా చేస్తే, సమస్త దోషాలు తొలగిపోయి.కోరిన కోరికలు నెరవేరుతాయి. సంతృప్తికర జీవితం లభిస్తుంది.

కొందరు అనుకునే విధంగా బాధ్యతలు తీరిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తే మాత్రం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. కనుక అనుకున్న క్షేత్రానికి వెళ్ళాలనే ఆలోచనను జాప్యం చేయకుండా పూర్తి చేసుకోవాలి. వృద్ధాప్యంలో తీర్థయాత్రలకు శరీరం సహకరించకపోవడం ద్వారా స్వామి దర్శనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయడం ఉత్తమం.

వయస్సున్నప్పుడే తీర్థయాత్రల్లో భాగం కావడం ద్వారా వివాహం, సంతానానికి సంబంధించిన దోషాలు సైతం తొలగిపోతాయి. అందుకే వయస్సున్నప్పుడే పవిత్ర క్షేత్రాలు, యోగులు, మహర్షులు, మహాభక్తులు, సిద్ధులు నడయాడిన ప్రాంతాల్లో తీర్థయాత్రలు చేపట్టాలి. జీవితంలో ఆధ్యాత్మికత, ధార్మికం మొదలైన ఉత్తమ గుణాలను చిన్న నాటి నుండి పెంచుకోవాలి.సుప్రసిద్ధ ఆలయాలకు వెళ్లడం ద్వారా దోషాలన్నీ తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.

దైవానుగ్రహం నా పట్ల పుష్కలంగా ఉందని నమ్మే నాలో దైవ చింతన, పాప భీతి, కర్మ సిద్ధాంతం పట్ల పూర్తి నమ్మకం వుంది… నేను దర్శించుకున్న కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రముల జ్ఞాపకాలు భక్తితో …

🎀 ఆంధ్ర ప్రదేశ్ : –
*************
🌺 చిత్తూరు : –

🌴తిరుమల ( అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం)

🌴కపిలేశ్వర స్వామి దేవాలయం
( తిరుపతి )

🌴కోదండ రామ స్వామి దేవాలయం
( తిరుపతి )

🌴గోవింద స్వామి దేవాలయం
( తిరుపతి )

🌴శ్రీనివాస మంగాపురం ( అలిమేలు మంగ సమేత కళ్యాణవేంకటేశ్వర దేవాలయం )

🌴కాణిపాకం ( వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం )

🌴 వేపంజేరి ( అష్ట లక్ష్మీ సమేత లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం )

🌴శ్రీ కాళహస్తి ( వాయు లింగేశ్వర దేవాలయం )

🌴సురుటు పల్లి ( పల్లికొండేశ్వర స్వామి దేవాలయం )

🌴నాగులా పురం ( వేద నారాయణ స్వామి దేవాలయం )

🌴తిరుచానూరు ( పద్మావతీ అమ్మవారి దేవాలయం )

🌴నారాయణ వనం ( పద్మావతీ సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం )

🌴తలకోన ( సిద్ధేశ్వర స్వామి దేవాలయం )

🌴అగస్త్యేశ్వర స్వామి దేవాలయం (తొండవాడ )

🌴ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం ( అప్పలాయ గుంట )

🌴వేణుగోపాల స్వామి దేవాలయం
( కార్వేటి నగరం )

🌺అనంతపురం : –

🌴కదిరి ( లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం )

🌴లేపాక్షి ( వీరభద్రస్వామి, నందీశ్వర దేవాలయం )

🌴పుట్టపర్తి ( సత్య సాయి బాబా నిలయం )

🌺కడప : –

🌴గండి (వీరాంజనేయ దేవాలయం )

🌺కర్నూలు : –

🌴శ్రీశైలం ( భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం )

🌴మహానంది ( మహా నందీశ్వర దేవాలయం )

🌴మంత్రాలయం ( రాఘవేంద్ర స్వామి నిలయం )

🌴యాగంటి ( శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి దేవాలయం )

🌴అహోబిలం ( నరసింహ స్వామి దేవాలయం )

🌺నెల్లూరు : –

🌴జొన్నవాడ ( కామాక్షి తల్లి దేవాలయం )

🌴పెంచల కోన ( నరసింహ స్వామి దేవాలయం )

🌺గుంటూరు : –

🌴మంగళగిరి (పానకాల స్వామి., లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు )

🌺కృష్ణా : –

🌴విజయవాడ ( కనక దుర్గ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం )

🌴 తిరుమల గిరి ( శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం )

🌺పశ్చిమ గోదావరి : –

🌴ద్వారకా తిరుమల ( వేంకటేశ్వర స్వామి దేవాలయం )

🌺తూర్పు గోదావరి : –

🌴అన్నవరం ( శ్రీ వీర వేంకట సత్య నారయణ స్వామి దేవాలయం )

🌴ద్రాక్షారామం ( (దక్షిణ కాశి ) శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం )

🌴కోటి పల్లి (శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం )

🎀 తెలంగాణ : –
***********

🌺మహబూబ్ నగర్ : –

🌴ఆలంపురం (బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం )

🌺వరంగల్లు : –

🌴హనుమకొండ ( వేయి స్థంబాల గుడి, నల్లరాతి నంది )

🌴పాలంపేట ( రామప్ప గుడి )

🌴భద్రకాళి అమ్మవారి దేవాలయం

🌺నల్గొండ : –

🌴యాదగిరి గుట్ట ( నరసింహ స్వామి దేవాలయం )

🌴వాడ పల్లి ( శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం )

🌴మట్ట పల్లి ( శ్రీ నృసింహ మహా క్షేత్రం )

🌺ఆదిలాబాద్ : –

🌴బాసర ( సరస్వతీ దేవి ఆలయం )

🌺రంగారెడ్డి : –

🌴చిలుకూరు ( బాలాజీ దేవాలయం )

🌺ఖమ్మం : –

🌴భద్రాచలం ( సీతారామ స్వామి ఆలయం )
🌴పర్ణశాల ( సీతమ్మ తల్లి వంటికి పసుపు రాసుకుని స్నానం చేసి నార దుస్తులు ధరించిన స్థలం )

🌺కరీంనగర్ : –

🌴వేములవాడ ( రాజ రాజేశ్వరి ఆలయం )

🎀మహారాష్ట్ర : –
**********
షిర్డీ

🎀రాజస్థాన్ : –
********

🌴జైపూర్లోని దేవాలయం

🎀ఉత్తర ప్రదేశ్ : –
*************

🌴 మధుర ( శ్రీ కృష్ణ జన్మ స్థానం & కృష్ణ ఆలయం )

🎀 కర్ణాటక : –
***********
🌴ధర్మస్థల ( మంజు నాథ స్వామి దేవస్థాన )

🌴మైసూరు ( చాముండేశ్వరి దేవస్థాన )

🌴కుక్కే (సుబ్రహ్మణ్యస్వామి దేవస్థాన )

🌴మహదేశ్వర బెట్ట( మలే మహదేశ్వర స్వామి దేవస్థాన )

🌴శ్రీ రంగ పట్టణం ( శ్రీ రంగ నాథ స్వామి దేవస్థాన )

🌴కోటి లింగాలు ( కోటి లింగాలతో అలరారుచున్న కోటి లింగేశ్వర దేవాలయ )

🌴 బంగారు తిరుపతి ( శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థాన )

🌴 ఓంకారేశ్వర ఆలయం
( ద్వాదశ జ్యోతిర్లింగ సహిత దివ్యాలయం )
బెంగళూరు.

🎀తమిళనాడు : –
***********
🌴తిరుత్తణి(సుబ్రహ్మణ్య స్వామి ఆలయం )

🌴వళ్ళీమలై ( వల్లీ దేవయాని సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం)

🌴శ్రీ పురం (నారాయణి అమ్మవారు)

🌴కన్యాకుమారి ( మూడు సముద్రాల సంగమ క్షేత్రం )

🌴రామేశ్వరం ( శ్రీ రామనాథ లింగే శ్వర స్వామి దేవాలయం )

🌴మహాబలిపురం ( caves temples)

🌴మధురై ( మీనాక్షి కోయిల్ )

🌴తంజావూరు(బృహదీశ్వరాలయం)

🌴 వైదీశ్వరన్ కోయిల్

👮ప్రముఖ పుణ్య నదీ స్నానాలు : –
*_*_*_*_*_*_*_*_*_*_*_*_*

👰కావేరి ( కర్ణాటక )

👰కుమార ధార ( కర్ణాటక )

👰కృష్ణా ( ఆంధ్ర ప్రదేశ్ )

👰గోదావరి ( ఆంధ్ర ప్రదేశ్ )

👼సముద్ర పుణ్య స్నానాలు : –
*- *- *- *- *- *- *- *- *- *- *

👸బంగాళాఖాతం

👸అరేబియా సముద్రం

👸హిందూ మహా సముద్రం

సర్వే జనా సుఖినోభవంతు 🙏

Source : Facebook User Daily

Leave a comment