తారదేవి ఆలయం కలకత్తా


♦️తారదేవి ఆలయం కలకత్తా (తాంత్రికులకు, అఘోరాలకు నిలయం)♦️

భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. అక్కడ సాధారణ భక్తుల కంటే అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుంది. అంతే కాకుండా దేవాలయం దగ్గర్లో ఉన్న స్మశానంలోనే అఘోరాలు ఉంటూ తాంత్రిక శక్తి కోసం పూజలు చేస్తుంటారు. వారి పూజలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
ముఖ్యంగా మరణించిన కన్నెపిల్లల శరీర భాగాలు పవిత్రమైన దేవతగా వారు భావించి వాటితో పాత్ర గా మార్చుకుని అందులోనే ఆహారం స్వీకరిస్తారు ఆ శరీర భాగాలు దొరక్కపోతే వారు వేరే పాత్రలో ముద్ద కూడా ముట్టరు. దానికి కారణం అక్కడే సతీదేవి దేహం విడిచింది అని అందుకు అక్కడ స్త్రీల మృతదేహాన్ని కూడా పవిత్రమైనది భావిస్తారు. ఇంతటి విచిత్రమైన దేవాలయం దర్శనం కోసం విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఆ భక్తులు కూడా తాంత్రిక శక్తుల కోసమే వస్తారు.

🌷దక్షయాగం🌷స్థలపురాణం🌷

పూర్వం దక్షప్రజాపతి అనే రాజు ఒక యాగం తలపెట్టాడు. ఈ యజ్జానికి ఆహ్వానం లేకపోయినా దక్షప్రజాపతి కుమార్తే అయిన దాక్షాయినీ తన భర్త అయిన శివుడిని బలవంతంగా ఒప్పించి పెట్టింటిలో జరిగే యాగానికి వెళ్లింది.అయితే అక్కడ ఆమెను తండ్రితో సహా తోబొట్టువులు ఎవరూ పలుకరించలేదు. దీంతో దీనిని ఆమె అవమానంగా భావించి మిక్కిలి కుమిలిపోయింది. నా భర్త మాట వినకుండా వచ్చానని పశ్చాత్తాప పడింది.
ఇటు పుట్టింటిలో ఉండలేక అటు అవమానం భరించలేక తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఈ విషయం తెలిసిన శివుడ ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు..

అంతే కాకుండా తన భార్య వియోగాన్ని భరించలేక శివుడు పార్వతి దేవి మ`త దేహాన్ని భుజం పై పెట్టుకొని ఆవేశంతో ప్రళయ తాండం చేస్తాడు. దీంతో ముల్లోకాలు భయపడుతాయి. సమస్య పరిష్కారం కోసం విష్ణువు ముందుకు వస్తాడు.తన సుదర్శన చక్రాన్ని వినియోగించి పార్వతి దేవి శరీరాన్ని 51 భాగాలు చేస్తాడు. ఆ భాగాలన్నీ పడిన ప్రదేశంలో శక్తి పీఠాలు వెలిశాయి అలా దక్షాయని నేత్రం పడిన ప్రాంతం ఈ తారా పీఠమని ఒక కథనం.

🌷మరో స్థల పురాణం శివయ్య హాలాహలం తాగటం🌷

మరో కథనం ప్రకారం దేవుళ్లు, రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేయడానికి పూనుకొంటారు. ఆ సమయంలో కొద్ది సమయం తర్వాత ఈ విశ్వాన్ని అంతటిని దహించి వేసే హాలాహలం సముద్రం నుంచి పుడుతుంది.దేవతల కోరిక పై ఈ విశ్వంలోని సమస్త కోటిని రక్షించడానికి వీలుగా పరమేశ్వరుడు ఆ హాలాహాలన్ని తాను తాగుతాడు. అయితే ఆంతటి దేవదేవుడిని కూడా ఆ హాలహలం ప్రభావం వల్ల అస్వస్థతకు గురయ్యి కొద్ది సేపు మూర్చపోతాడు.

♦️తారా దేవి రూపంలో♦️

దీంతో దేవతలు జగన్మాతను ఈ గండం నుంచి కాపాడాల్సిందిగా వేడుకొంటారు. దీంతో జగన్మాత తారా దేవి రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ పరమశివుడిని తన ఒడిలోకి తీసుకుని తన స్తన్యం ఇస్తుంది. దీంతో పరమశివుడు కొంత కొలుకుంటారు.
అందుకే ఇక్కడ తారాదేవి పరమశివుడికి స్తన్యం ఇచ్చిన స్థితిలో నల్లటి విగ్రహం ఉంటుంది. అయితే ఈ విగ్రహం మొత్తం ఎల్లప్పుడూ పూలతో కప్పబడి ఉంటుంది. కేవలం అమ్మవారి మొహం మాత్రమే చూడటానికి వీలవుతుంది.
అందువల్లే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక అమ్మవారి నేత్రాలు పడటం వల్ల ఈ పీఠం మిగిలిన శక్తి పీఠాలతో పోలిస్తే అత్యంత శక్తివంతమైనది పురాణాలు చెబుతాయి. ఇక్కడ అమ్మవారిని కొలిచిన వారికి అతీంద్ర శక్తులు వస్తాయని చెబుతారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అమ్మవారి విగ్రహానికి అతీతమైన శక్తి వస్తుందని ఆ సమయంలో ఈ దేవిని ఉపాసన చేసిన వారికి తాంత్రిక శక్తులకు వసమవుతాయి అని చెబుతారు.

అందువల్లే ఈ దేవాలయాన్ని తాంత్రిక శక్తుల దేవాలయాలకు రాజధానిగా పేర్కొంటారు. అందువల్లే ఇక్కడకు తాంత్రిక కార్యక్రమాలు నిర్వహించే అఘెరాలు ఎక్కవగా వస్తుంటారు.

దేవాలయంలో అమ్మవారికి రెండు విగ్రహాలు ఉంటాయి. ఒక విగ్రహం శివుడికి పాలు ఇచ్చేదిగా ఉంటుంది. ఇది రాతితో తయారయ్యింది. మరొకటి కొన్ని లోహాలను కలిపి తయారు చేసిన విగ్రహం. ఈ విగ్రహంలో అమ్మవారు భయంకరంగా కనిపిస్తారు.

నాలుగు చేతులతో, చింత నిప్పుల కన్నులతో ఉంటారు. చేతుల్లో ఆయుధాలను కలిగి ఉంటారు. కపాళ హారాన్ని ధరించి చూడటానికి గగుర్పాటు కలిగించేలా ఉంటారు. దీనినే అఘోరాలు ఎక్కువగా పూజిస్తుంటారు.

ఈ అఘోరాలు ఈ దేవలయం పక్కన ఉన్న స్మశానంలోనే ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఇందుకోసం చిన్న కుటీరాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కుటీరాలు చాలా వరకూ ఎముకల నిర్మితం. వారి పూజలు కూడా చాలా విచిత్రంగా ఒళ్లును గగుర్పాటుకు గురిచేసేలా ఉంటాయి.

ఇక్కడ అఘోరాలు కూడా చాలా విచిత్రంగా ఉంటారు. స్మశానంలో అప్పుడే కాల్చిన శవం బూడిదను వీరు తమ ఒంటికి రాసుకుంటారు. మనుష్యుల ఎముకలను ముఖ్యంగా పెళ్లికాని వారి భౌతిక కాయం నుంచి వేరు చేసిన ఎముకలు వీరు తమ శరీరం పై వేసుకొంటారు.

అఘోరాలు ఆహారం తీసుకునే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్ల పుర్రెలు, కటి భాగం (పెల్విక్ బోన్స్, హిప్ బోన్) తో చేసిన ప్రాత్రలో వారు ఆహారాన్ని తీసుకుంటారు.

ఒక వేళ అవి దొరకకపోతే ఉపవాసం అయినా ఉంటారు కాని వేరొక పాత్రలో ఆహారాన్ని తీసుకోరు. వీరు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. సంవత్సరాల కొద్ది వారు అలాగే ఉండి పోతారు. ఇక అమ్మవారిని కొన్ని ఏళ్లపాటు వారు ఉపాసన చేస్తూ ఇక్కడ ఉండిపోతారు.

ఈ తాంత్రిక దేవాలయం పశ్చిమ బెంగాల్ లోని బీర్బుమ్ జిల్లాలో తారపీఠ్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు చేయడానికి విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
(ఎంతో కష్టమైన పనులు కూడా ఈ తల్లి అనుగ్రహం ఉంటే సాధ్యం అవుతుంది, అలాగే ఎంతటి ప్రమాదం అయినా తిలగించ గల శక్తి ఉన్న తల్లి)
🌷ఎలా చేరుకోవాలి.🌷

కలకత్తా ఎయిర్ పోర్టు నుంచి తారాపీఠ్ కు 216 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి ప్రేవేటు ట్యాక్సీల ద్వారా తారాపీఠ్ చేరుకోవచ్చు. తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రాంపుర్హాట్ రైల్వే స్టేషన్ కలదు. కలకత్తా నుంచి బస్సులు కూడా ఉన్నాయి.

🌷శ్రీ మాత్రే నమః🌷

సేకరణ FB

🌺🙏🙏🙏🏻🙏🏻🙏🏻🌺

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s