శ్రీచక్ర సంచారిణీ!


శ్రీచక్రం సమస్త కామిత ఫలం. పార్వతీ దేవిని పూజించి షోడశ కామ్యాలను పొందేందుకు అరవై నాలుగు మంత్రాలు శివుడు మానవాళికి ప్రసాదించాడని గరుత్మంతుడికి శ్రీ విష్ణువు చెప్పినట్లుగా లింగ పురాణం వెల్లడిస్తోంది. మనిషికి కోరికలు అధికం. కోరికలన్నీ తీరాలంటే అరవైనాలుగు మంత్రాలతో నియమం ప్రకారం అమ్మవారిని పూజించాలంటారు. ఇలా పూజించడం మానవాళికి కష్టసాధ్యమని, పరమేశ్వరుణ్ని సులభమార్గం చూపించమని కృతయుగంలో మునులు కోరితే పరమేశ్వరుడు శ్రీవిద్యోపాసనను ప్రసాదించాడట.

త్రిపురసుందరి, శ్రీచక్రం శ్రీ విద్యామంత్ర ఉపాసనలే శ్రీ విద్యోపాసన. శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతలను సూచిస్తాయి. అందువల్ల శ్రీచక్రం దివ్యశక్తుల సంగమం. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీన్ని నవయోని చక్రం లేదా నవచక్రం అనీ అంటారు. శ్రీచక్రంలోని ఒక్కో భాగం త్రిపుర సుందరి సూచికగా భావిస్తారు. శ్రీ చక్రంలో వివిధ పరిమాణాల్లో తొమ్మిది త్రిభుజాలు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో మహత్తర శక్తి ఇమిడి ఉంటుంది.

శ్రీచక్రంలో మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న చతురస్రాకారాన్ని త్రైలోక్య మోహనం అంటారు. సర్వ ఆశా పరిపూరకం అనే పదహారు రేకుల వృత్తం, సర్వ సంక్షోభనం అనే ఎనిమిది రేకుల వృత్తం, సర్వ సౌభాగ్యదాయకం అనే పద్నాలుగు అతి చిన్న త్రిభుజాలు సైతం ఉంటాయి. ఈ నిర్మాణంలోని త్రిభుజాలు సర్వార్థ సాధకాలు, సర్వ రక్షకాలు, సకల వ్యాధిహరణాలు. మధ్యలోని త్రిభుజం (సర్వ సిద్ధిప్రద) కేంద్రంలో బిందువైన బీజం- సర్వ ఆనందమయి.

వామకేశ్వర తంత్రం రెండో భాగం యోగినీ హృదయంలో శ్రీచక్రం గురించిన వివరాలు ఉన్నాయి. మహోన్నతమైన స్త్రీ శక్తికి ప్రతిస్పందనగా శ్రీచక్రం సృష్టి జరిగిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అప్పుడు సంభవించిన మహాద్భుత ప్రకంప నలవల్ల శూన్యాన్ని పోలిన బిందువు చైతన్య స్థితిలో ఉద్భవించింది. ఈ బిందువునే ముగురమ్మల మూలపుటమ్మ అంటారు. ఈ నవయోని చక్రం చైతన్యానికి, అనంత సౌఖ్యానికి సూచిక. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు జగత్సంబంధమైన శివ పార్వతుల పారలౌకిక సంయోగానికి చిహ్నం. ఇది మహాత్రిపుర సుందరికి నిలయం. ఇక్కడే ఆమె సంచరిస్తూ ఉంటుందంటారు. అందుకే లలితా సహస్ర నామంలో ఆమెను శ్రీచక్ర సంచారిణీ అని సంబోధించారు. కేంద్ర బిందువు చుట్టూ నిర్మితమై ఉన్న శ్రీచక్ర భాగాలు అనంతమైన విశ్వాలకు, బ్రహ్మాండాలకు సంకేతం.

శ్రీచక్రాన్ని రెండు రకాలుగా నిర్మించి పూజిస్తారు. ఈ రెండూ సంప్రదాయబద్ధమైనవే. రేఖాచిత్రంలా రెండు పార్శ్వాలు (ద్విమితీయం)గా భూమిపై నిర్మిస్తే ఆ శ్రీచక్రాన్ని భూప్రస్తారం అంటారు. పిరమిడ్‌లాగా మూడు పార్శ్వాలు(త్రిమితీయం)గా నిర్మిస్తే దాన్ని మేరుప్రస్తారం అంటారు. అంటే మేరు పర్వతంలా ఉంటుంది. శ్రీచక్రం సహస్రారకమలం ఒకటే. వెలుపలి పూజలకు శ్రీచక్రం, లోపలి స్మరణకు సహస్రారపద్మం ధ్యానసాధనాలు. శ్రీచక్ర పూజలో అమ్మవారి చుట్టూ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది మాతృకలను ఆవాహన చేస్తారు. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తారు.

పరమాత్మ స్వరూపుడైన మనిషిలో శక్తిని చైతన్యపరచడానికి, కర్మను స్వీకరించి ఆచరించి విముక్తిని పొందే ప్రయత్నానికి సంబంధించిన తాంత్రిక పూజే శ్రీచక్ర ఆరాధన. అందుకే శ్రీచక్ర తంత్ర జ్ఞానం కలిగినవారి వద్ద సిద్ధి పొంది శ్రీచక్ర ఆరాధన చేయాలని తంత్ర శాస్త్రం తెలుపుతోంది.

🌹🌹🌹#సర్వంశివసంకల్పం🌹🌹🌹

🌺🙏🙏🙏🙏🙏🌺

Source FB

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s